● నేడు కొలువుదీరనున్న పాలకవర్గాలు ● గ్రామాల్లో పేరుకుపో
బెల్లంపల్లి: జిల్లాలో కొత్తగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లోని 306 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా ప్రజలకు ఎన్నో హామీలిచ్చి సర్పంచులుగా గెలిచినవారికి పల్లెల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక ఏ గ్రామంలో చూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. నేటి నుంచి పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనుండగా సమస్యలు పరిష్కారమవుతాయని, నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
అధ్వానంగా రహదారులు
ఆయా గ్రామాల ప్రధాన, అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. బీటీ, కంకర చెదిరి గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులెదురవుతున్నాయి. భీమిని, వేమనపల్లి, కాసిపేట, తాండూర్, కన్నెపల్లి, నెన్నెల, కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం, హాజీపూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.
పారిశుధ్యం.. అస్తవ్యస్తం
పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. రో జువారీగా చెత్త సేకరించడంలేదు. మొక్కుబడిగా సి బ్బందితో అక్కడక్కడా చెత్త తొలగించినట్లు చేసి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దు స్థితి ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలోనూ నెలకొంది. దీంతో గ్రామీణులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీకో ట్రాక్టర్ ఉన్నప్పటికీ పారి శుధ్య పనులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బంది లేరు. చెత్తాచెదారం రోడ్లు, వీధుల్లో రోజుల తరబడి పేరుకుపోయి జనం ఇబ్బంది పడుతున్నారు.
పూడికతో నిండిన డ్రైనేజీలు
మురుగునీటి పారుదల సౌకర్యం ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడటం లేదు. ఏటా కాలువల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నా నాణ్యతలేమితో త్వరగా పాడైపోతున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ గ్రామపంచా యతీల్లోని మురుగుకాలువలు పూడికతో నిండి దు ర్గంధం వ్యాపింపజేస్తున్నాయి. మురుగుకాలువలు దోమలకు ఆవాసంగా మారగా జనం వ్యాధుల బా రిన పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో మురుగుకాలువలు సరిగా లేక రోడ్లపై నుంచి డ్రైనేజీ నీరు పారుతూ జనం నడవలేని స్థితికి చేరుతున్నాయి.
శిథిలావస్థలో పంచాయతీ భవనాలు
జిల్లాలో పలు పంచాయతీలకు నేటికీ సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో పంచాయతీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. పక్కా భవనాలున్న చా లాచోట్ల శిథిలావస్థకు చేరుకుని దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. వీటికి మరమ్మతులు చేయాల్సిన అవసరమున్నా పట్టింపు కరువైంది. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సి ఉండగా ఏళ్లు గడుస్తున్నా అలాంటి చర్యలేవీ కనిపించడంలేదు.
బంజరుదొడ్లపై పట్టింపు కరువు
గ్రామపంచాయతీలకు కాస్తో.. కూస్తో ఆదాయాన్ని తెచ్చి పెట్టే బంజరు దొడ్ల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. వీటి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. గ్రామాల్లో విచ్చలవిడిగా రోడ్లపై సంచరించే, పొలాలకు వెళ్లి పంటచేన్లకు నష్టం కలిగించే మూగజీవాలను బంజరుదొడ్డిలో తోలే విధానం జిల్లాలో ఇంకా చాలాచోట్ల ఉంది. పశువుల యజమానుల నుంచి పన్ను వసూలు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉండగా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
అలాగే వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. అనేక చోట్ల ఊరికి దూరంగా వీటిని ఏర్పాటు చేయగా పట్టింపు కరువైంది. క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు చాలాచోట్ల ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నాయి.
చాలాచోట్ల మరమ్మతుకు
నోచుకోని చేతిపంపులు
గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన చేతిపంపులు అలంకారప్రాయంగా మారాయి. మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సమస్య ఏర్పడిన ప్రతీసారి గ్రామీణులు సొంతంగా మెకానిక్ కు సొంత డబ్బులు చెల్లించి రిపేర్ చేయించుకుంటున్నారు. ఇంకొన్ని పంచాయతీల్లో తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు లీకేజీలేర్పడి మరమ్మతుకు నోచుకోవడంలేదు. ఫలి తంగా గ్రామీణులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని నూతన పాలకవర్గాలను కోరుతున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేరేనా?
పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చారు. ప్రతీ ఒక్కరి ఇంటి పన్ను చెల్లిస్తామని, గ్రంథాలయం, జిమ్ ఏర్పాటు చేయిస్తామని, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని, మినరల్ వాటర్ సరఫరా చేస్తామని, ఆడబిడ్డ పెళ్లికి రూ.5వేల కట్నం అందజేస్తామని, ఎవరు మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం చేస్తామని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయిస్తాం అని.. ఇలా హామీల వరద పారించి సర్పంచులుగా గెలిచారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతమంది సర్పంచులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో చూడాలి మరి.
● నేడు కొలువుదీరనున్న పాలకవర్గాలు ● గ్రామాల్లో పేరుకుపో


