ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
మందమర్రిరూరల్: పట్టణంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డి అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావా లని ఆకాంక్షించారు. నాయకులు దుర్గం నాగేశ్, అజీమొద్దీన్, ప్రభుదేవ్, రాజ్‌కుమార్, కవిరాజ్, సుందర్, జావీద్‌పాషా, అజయ్, షారూఖ్ తదితరులు పాల్గొన్నారు.


