ఏఐ మాయ చేస్తున్నారు..!
పోస్టాఫీసు వద్ద రోడ్డుపై పులి
వెళ్తున్నట్లు సృష్టించిన చిత్రం
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 17న అర్ధరాత్రి ఓపీ వార్డు వైపు ఉన్న ల్యాబ్ వద్ద ఓ రహస్య నీడ కనిపించినట్లు, ఆస్పత్రి మెట్లుపైకి ఎక్కే దారిలో మనిషిని పోలిన ఆకారం ఉన్నట్లు వీడియో రూపొందించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రతీ రోజు ఆస్పత్రికి 400 మంది ఓపీ, 250 మంది అనారోగ్య సమస్యతో వార్డుల్లో చికిత్స పొందుతుండగా.. మరో 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దయ్యం ఉన్నట్లుగా ప్రచారంతో వారంతా ఆందోళన చెందారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో పని చేసే వారే వీడియో తీసి గ్రాఫిక్స్‌తో ఫేక్ వీడియో సృష్టించినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈ నెల 17న రాత్రి 11:35 గంటలకు మంచిర్యాల నగర పరిధిలోని సీసీసీ పోస్టాఫీసు వద్ద పులి సంచరిస్తోందని, కారు ముందు దూసుకెళ్తున్నట్లుగా ఓ ఫొటో ఏఐతో తయారు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు రాలేదు. ఉదయం వేళల్లో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు విధులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి పులి జాడ లేదని నిర్ధారించారు. ఫేక్ ఫొటో పోస్టు చేసిన వ్యక్తిని పట్టుకుని సీసీసీ పోలీసులకు అప్పగించారు.
ఏఐ మాయ చేస్తున్నారు..!


