
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
నిర్మల్: మండలంలోని టెంబుర్ని గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోసారి గంగయ్య (46) కిరాణాషాపు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం షాపు తెరిచి క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రిఫ్రిజిరేటర్ వైర్‌కు చేయి తగిలి కరెంట్ ప్రవహించడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ పరిశీలించగా అప్పటికే గంగయ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య వనజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.