
మంత్రి పీఏపై బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
చెన్నూర్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కార్మికశాఖ మంత్రి వివేక్ పీఏ రమణా రావుపై శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సు బ్బారావుకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారమేశ్ తెలిపారు. ఆయ న మాట్లాడుతూ.. గతంలో న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. మంత్రి పీఏ గా ఉన్న రమణారావు దళితనేతపై తప్పుడు ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమో దు చేయకుంటే రామగుండం సీపీకి ఫిర్యాదు చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ సర్పంచ్ కృష్ణ, నా యకులు సాంబగౌడ్, మేడ సురేశ్‌రెడ్డి, కొప్పు ల రవీందర్, మహేందర్, జడల మల్లేశ్, నా యబ్, బోగె భారతి తదితరులున్నారు.
తేజకళ్యాణికి నియామకపత్రం
లక్సెట్టిపేట: పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన కూడెల్లి తేజకళ్యాణి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ ఫలితాల్లో ఐసీడీఎస్ సీడీపీవోగా ఎంపికై శుక్రవారం సచి వాలయంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. తేజకళ్యాణి తండ్రి సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి స్వరూపారాణి గృహిణి. తేజకళ్యాణి పట్టణంలోని ట్రినిటి పాఠశాలలో ఎని మిదో తరగతి వరకు చదువుకున్నారు. కాగజ్‌నగర్‌లోని నవోదయ సీటు రాగా అందులో ప దో తరగతి వరకు, హసన్‌పర్తిలో ఇంటర్, హై దరాబాద్‌లో డిగ్రీ, ఎన్‌ఐఎన్‌లో పీజీ పూర్తి చేశా రు. తేజకళ్యాణిని పలువురు అభినందించారు.

మంత్రి పీఏపై బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు