ఉపాధికి ఐటీఐ బాటలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఐటీఐ బాటలు

Jun 17 2025 4:56 AM | Updated on Jun 17 2025 4:56 AM

ఉపాధి

ఉపాధికి ఐటీఐ బాటలు

● ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● జిల్లా వ్యాప్తంగా 1328 సీట్లు ● ఈ నెల 21 తుది గడువు

మంచిర్యాలఅర్బన్‌: తక్కువ సమయంలోనే కొలు వులు సాధించి స్థిరపడాలనుకునే యువతకు పారి శ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) బాటలు వేస్తోంది. పారిశ్రామిక నైపుణ్యంతో అత్యున్నత స్థాయికి చేరుకునే వీలుంది. మరోవైపు ప్రభుత్వం ఐటీఐల్లో అ డ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్ల(ఏటీసీ) ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. పదో తరగతి విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరంలో ఐటీఐ కోర్సుల్లో చేరికకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 21వరకు తుది గడువు విధించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 13,28 సీట్లు ఉండగా.. ఇందులో ప్రభుత్వ ఐటీఐల్లో 732, ప్రైవేటు ఐటీఐల్లో 596సీట్లు ఉన్నాయి. మంచిర్యాలలో 264, మందమర్రిలో 284, శ్రీరాంపూర్‌లో 96, జన్నారంలో 88 సీట్లు ఉన్నాయి. ఏడాది కోర్సులు డీజిల్‌ మెకానిక్‌, కంప్యూటర్‌, వెల్డర్‌, కోపా, సోలార్‌ టెక్నీషియన్‌, రెండేళ్ల కోర్సులు ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, టర్నర్‌, డ్రాఫ్ట్‌ మెన్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, మోటార్‌ మెకానిక్‌ కోర్సులు ఉన్నాయి. పదో తరగతి మెమో, ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ బోనఫైడ్‌, కుల ధ్రువీకరణ పత్రం, టీసీతో వెబ్‌సైట్‌ https://iti.telangana.gov.in/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏటీసీ కోర్సులు ఇలా..

గత ఏడాది మందమర్రి ప్రభుత్వ ఐటీఐలో ఏటీసీ ప్రారంభించారు. శ్రీరాంపూర్‌, మంచిర్యాల, జన్నారంలో ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మందమర్రిలో ఆరు కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్వాన్స్‌ సీఎన్‌సీ మెకానిక్‌ టెక్నీషీయన్‌ 24, ఆర్టీషియిన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌, టూల్‌ 20 సీట్లు, బేసిక్‌ డిజైన్‌ అండ్‌ పర్చువల్‌ వెరి ఫైర్‌ 24 సీట్లు, ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజి టల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నీషీయన్‌ 40 సీట్లు, మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ 40 సీట్లు, మెకానిక్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌ 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మంచిర్యాల ఐటీఐ భవనం

ఎన్నో అవకాశాలు

ఐటీఐ శిక్షణతో ఎన్నో ఉద్యోగాలు సాధించవచ్చు. సొంతంగా వర్క్‌షాప్‌లు పెట్టుకుని ఉపాధి కల్పించవచ్చు. తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఎన్‌పీడీసీఎల్‌, రైల్వే, ఆర్టీసీ, బీహెచ్‌ఈఎల్‌, డీఆర్‌డీవో, ఇస్రో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌ వంటి రక్షణ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ(టామ్‌కామ్‌) ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు.

– రమేష్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌, మంచిర్యాల

ఉపాధికి ఐటీఐ బాటలు1
1/1

ఉపాధికి ఐటీఐ బాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement