ఇంటర్ మూల్యాంకన వేతనం చెల్లించాలి
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ మూ ల్యాంకన వేతనం త్వరగా చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్–475 ఆధ్వర్యంలో శుక్రవారం డీఐఈవో అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. మూ ల్యాంకనం పూర్తయిన వెంటనే ఎలాంటి కోతలు లేకుండా పూర్తి నగదును ఖాతాలో జమ చేయాలని కోరారు. ఇంటర్మీడియెట్ పరీక్షల వి ధులకు సంబంధించి సీఎస్, డీవోలు, సిట్టింగ్‌స్క్వాడ్ రెమ్యూనరేషన్ చెల్లించాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసా ద్, కార్యదర్శి సందీప్‌కుమార్, కోశాధికారి సో మయ్య, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శులు సత్తెమ్మ, శైల జ, సునీత తదితరులు పాల్గొన్నారు.


