గర్భస్థ శిశువు మృతి | - | Sakshi
Sakshi News home page

గర్భస్థ శిశువు మృతి

Jan 15 2026 8:34 AM | Updated on Jan 15 2026 8:34 AM

గర్భస

గర్భస్థ శిశువు మృతి

● వైద్యుల నిర్లక్ష్యమంటూ బాధితుల ఆందోళన ● ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు

మంచిర్యాలక్రైం: గర్భస్థ శిశువు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రం మంచిర్యాలలో బుధవారం కలకలం రేపింది. బాధితులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు వైద్యులపై కేసు నమోదైంది. బాధితుల కథనం ప్ర కారం.. నెన్నెల మండలం చిన్నవెంకటాపూర్‌ గ్రా మానికి చెందిన అంబటి వెంకటేష్‌ భార్య రమ్య పె ళ్లయిన ఐదేళ్లకు గర్భం దాల్చింది. మొదటి నెల నుంచి మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలి సూచనల మేరకు మందులు వాడుతోంది. ఈ నెల 14న సాధారణ ప్రసవానికి వైద్యురాలు సమ యం ఇచ్చింది. బుధవారం ఇంటి వద్ద నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యురాలు లేకపోవడంతో ఆమె సూచన మేరకు తన బంధువు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యురాలు పరీక్షించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరిశీలించి గర్భంలోనే శిశువు మృతిచెందిందని ఆపరేషన్‌ చేసి బయటకు తీశారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన

వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే గర్భస్థ శిశువు మృతిచెందిందని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే స్తూ మొదట వైద్యం పొందిన ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక సీఐ ప్రమోద్‌రావు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేశారు.

మరో ఆస్పత్రిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో మందమర్రి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వడ్లూరి శ్రీ నివాస్‌(53) బుధవారం మృతిచెందాడు. సీఐ ప్ర మోద్‌రావు, బాధితుల కథనం ప్రకారం.. కాలు దె బ్బతగిలి శ్రీనివాస్‌ ఈ నెల 10న ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బుధవారం అస్వస్థతకు గురి కావడంతో రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుడితో బంధువులు వాగ్వాదానికి దిగారు. పోలీస్‌లు ఇరువర్గాలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

గర్భస్థ శిశువు మృతి1
1/1

గర్భస్థ శిశువు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement