పని గంటలు తగ్గించాలి
మంచిర్యాలటౌన్: వేసవి కాలం దృష్ట్యా పని గంటలు తగ్గించాలని మంచిర్యాల నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ శివాజికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్మికులకు బట్టలు, చె ప్పులు, గ్లౌజులు ఇప్పించాలని, ప్రతీ కార్మికునికి కా ర్పొరేషన్ ఐడీ ఇవ్వాలని, డ్రైవర్లను పాత పద్ధతిలో నే వారి స్థానంలోనే పంపించాలని పేర్కొన్నారు. పీ ఎఫ్, ఈఎస్‌ఐ కార్మికుల ఖాతాల్లో జమ కావడం లే దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యాంకుమార్, కోశాధికారి శ్రీనివాస్, కార్మికులు గోగర్ల ఆశయ్య, ఆవునూరి లింగయ్య, చిప్పకుర్తి లింగయ్య, ఆవుల శ్రీనివాస్, రేగుంట రాయలింగు పాల్గొన్నారు.


