నిరసనలో పాల్గొన్న ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీప ప్రభుత్వ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట బుధవారం బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న జీహెచ్‌ఎంసీ మేయర్
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని బుధవారం జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేయర్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మహాపోచమ్మ దేవాలయం, పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట నాయకులు గడ్డం అరవింద్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.
జొన్న పంట దగ్ధం
ముధోల్: ముధోల్‌కు చెందిన కోరి యోగేశ్‌కు చెందిన జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం... యోగేశ్ 10 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశాడు. చేతికొచ్చిన జొన్న పంటను ఒకే చోట కు చేర్చి కుప్పలుగా పోశాడు. ఇటీవల వర్షం కురవడంతో రక్షణ కోసం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచాడు. బుధవారం ఉదయం చేనుకు వచ్చే సరికి పంట కుప్పలు కాలిపోయి ఉన్నాయి. పంట కుప్పలు దగ్ధం కావడానికి గల కారణం ఎంటో తెలియడం లేదని బాధిత రైతు వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంట సాగు చేశానని అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తెల్లకల్లు షాపుపై పోలీసుల దాడి
బేల: మండలంలోని జంగుగూడ (సైద్‌పూర్)లో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న తెల్లకల్లు షాపుపై మంగళవారం రాత్రి జైనథ్ సర్కిల్ సీఐ సాయినాథ్, బేల ఎస్సై దివ్యభారతిలు సిబ్బందితో కలిసి దాడి చేశారు. తెల్లకల్లు షాపులోని 400 లీటర్ల తెల్లకల్లును ధ్వంసం చేసి, రూ.3వేల నగదును సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. షాపు యజమాని బేలకు చెందిన సత్యనారయణ్ గౌడ్, షాపు నిర్వాహకుడు తుకారాంతో పాటు అక్రమషాపు నిర్వహణకు రూ.12లక్షలకు అనుమతి ఇచ్చిన వీడీసీ చైర్మన్ ఆత్రం రాముడుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నిరసనలో పాల్గొన్న ఎంపీ నగేశ్
నిరసనలో పాల్గొన్న ఎంపీ నగేశ్


