గంగిపల్లిలో వన్యప్రాణుల వేట | - | Sakshi
Sakshi News home page

గంగిపల్లిలో వన్యప్రాణుల వేట

Apr 3 2025 12:57 AM | Updated on Apr 3 2025 1:31 PM

ఉచ్చుకు బలైన చుక్కల దుప్పులు

మాంసం విక్రయానికి యత్నం

పట్టుకున్న అటవీశాఖ అధికారులు 


 

జైపూర్‌: అటవీప్రాంత సమీపంలో పంట పొలాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల ఉచ్చుకు వన్యప్రాణులు బలయ్యాయి. ఉచ్చుకు రెండు చుక్కల దుప్పులు మృత్యువాతపడగా వాటి మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. జైపూర్‌ మండలం గంగిపల్లి గ్రామ శివారులో గల పంట పొలాల్లో రైతులు అమర్చిన విద్యుత్‌ తీగలకు రెండు చుక్కల దుప్పులు మృతిచెందాయి. 

మాంసాన్ని విక్రయించేందుకు చిన్న ముక్కలుగా కోస్తుండగా గంగిపల్లి గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్‌రెడ్డి, గూడపాపన్నలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు మంచిర్యాల రేంజ్‌ అధికారి రత్నాకర్‌ తెలిపారు. ఇద్దరిపై వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement