జనావాసాల్లోకి చుక్కల దుప్పి
ఖానాపూర్: అటవీ ప్రాంతంలో నీరు లేకపోవడంతో జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం కుక్కలు వెంబడించడంతో దుప్పి ఓ నివాసంలో చొరబడి అందులోనే ఉండిపోయింది. దీంతో మంగళవారం విద్యానగర్‌లోని ఓ నివాసంలో దుప్పిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్‌ఎస్‌వో రవీందర్, ఎఫ్‌బీవో సాధు ముత్యం అక్కడికి చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకున్న దుప్పి పలువురి నివాసాల్లోకి చొరబడింది. ఎట్టకేలకూ అరగంట సేపటికి ఓ ఇంట్లో బందించారు. కళ్లకు గంతలు, కాళ్లకు తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం అటవీ శాఖ జీపులో అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


