పద్యాలాపనలో రాష్ట్రస్థాయి పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి తిరునగరి లింబగిరి స్వామి రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో ఇటీవల మూడు రోజులపాటు క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లింబగిరి స్వామి తనదైన శైలిలో పద్యాల పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న చేతుల మీదుగా జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.
డ్రాగన్ తోట దగ్ధం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని లింగోజి తాండ సమీపంలో ఉన్న డ్రాగన్ తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు జాదవ్‌రాజు నాలుగు ఎకరాల్లో డ్రాగన్ తోటను సాగు చేస్తున్నారు. ఆదివారం బంధువు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లాడు. తోటకు మంటలు ఎలా అంటుకున్నాయో అంతు పట్టడం లేదన్నాడు. ఈ ప్రమాదంలో రూ.12 లక్షల నష్టం వచ్చిందని రైతు వాపోయాడు. సోమవారం మాజీ సర్పంచ్ జాదవ్ హరినాయక్ తోటను పరిశీలించారు.
పద్యాలాపనలో రాష్ట్రస్థాయి పురస్కారం


