బంగారం గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారం గొలుసు చోరీ

Mar 27 2025 12:25 AM | Updated on Mar 27 2025 12:27 AM

ఇచ్చోడ: బస్సు కోసం వేచిచూస్తున్న మహిళకు బైక్‌పై నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. మండలంలోని బోరిగామకు చెందిన ముల్కల లక్ష్మి బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీనగర్‌ బస్టాప్‌ వద్ద బస్సు కోసం వేచిచూస్తుంది. ఈక్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె వద్దకు వెళ్లారు. భార్య బంగారం గొలుసు పోయింద ని, అందరి వద్ద చెక్‌ చేస్తున్నామని ఆమెకు మా యమాటలు చెప్పి నమ్మించారు. మహిళ మెడలో బంగారం గొలుసు తీసి ఇవ్వమని అడిగారు. వారి మాటలు నమ్మి గొలుసు ఇవ్వగానే చూసినట్లుగా నమ్మించి ఒక పేపర్లో చుట్టి ఆమె చేతికి ఇచ్చి పరారయ్యారు. ఆ పేపర్‌లో చూడగా బంగారు గొలుసు లేకపోవడంతో లబో దిబోమంది. పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చోరీకి గురైన గొలుసు తులం వరకు ఉంటుందని తెలిపారు.

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బెదిరించి..

ఉట్నూర్‌రూరల్‌: నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఎస్పీ సారూ పిలుస్తున్నారని ముగ్గు రు యువకులు బెదిరించి ఆమె మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంలో బుధవారం పట్టపగలే ఈ ఘటన చో టు చేసుకుంది. ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఉమా పని ని మిత్తం బుధవారం ఉట్నూర్‌కి వచ్చింది. స్థానిక జూనియర్‌ మున్సిఫ్‌ కోర్టు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్పీ సారూ పిలుస్తున్నారని గేటు వద్ద ముగ్గురు పోలీసులమని దూరం నుంచి ఐడీ కార్డు చూపెడుతూ బెదిరించారు. మాయమాటలతో ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్‌ తెలిపారు. కాగా, ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు.

బైక్‌ చోరీ

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని శాంతినగర్‌కాలనీకి చెందిన తబ్రేజ్‌ పాషా బుధవారం ఉదయం పాల కోసం వెళ్లి పాలు తెచ్చి ఇంటి ముందు బైక్‌ పార్కింగ్‌ చేశారు. 10:30 గంటల సమయంలో చూడగా బైక్‌ కనిపించకుండా పోయింది. చుట్టూపక్కల గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడు వన్‌టౌన్‌ పో లీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఇసాక్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్‌ బోల్తా

సోన్‌: మండలంలోని గంజాల్‌ సమీపంలో బుధవారం 44వ జాతీయ రహదారి పక్కన కంటైనర్‌ బోల్తాపడింది. ఎస్సై గోపి కథనం ప్రకారం.. కంటైనర్‌ నాగపూర్‌ నుంచి చెట్ల మూలికలతో హైదరాబాద్‌ వైపు వెళ్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ దుర్గేష్‌ కుమార్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో కంటైనర్‌ బోల్తా పడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోకార్‌ విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement