ఇంద్రవెల్లి: మండలంలోని బిక్కుతాండ గ్రామంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు.. సెడ్మాకి చంద్రకాంత్(28) వ్యవసాయ కూలీ పని చేస్తున్నాడు. భార్య మంజుల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. చంద్రకాంత్ గత 10 రోజులుగా జ్వరం బాధపడుతున్నాడు. మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించడంతో కుటుంబీకులు ముత్నూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో కుదుటపడింది. ఇంటికి వచ్చాక తనకు ఏదో అవుతుందని భయపడేవాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయేవాడు కాదు. బుధవారం ఉదయం భార్యను డ్యూటీకి వెళ్లాలని చెప్పి ఆమె వెళ్లాక దూలానికి ఉరేసుకున్నాడు. చుట్టూపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామ అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైతెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


