హ్యాండ్‌బాల్‌ జట్ల ముమ్మర సాధన | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ జట్ల ముమ్మర సాధన

Oct 16 2026 12:42 AM | Updated on Oct 16 2026 12:42 AM

● నేటినుంచి రెండు మైదానాల్లో మ్యాచ్‌లు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లా బాల, బాలికల అండర్‌– 14 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌నకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. శుక్రవారం నుంచి లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌ మైదానంలో టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి, ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

బాల, బాలికల జట్ల ప్రాక్టిస్‌

మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌ మైదానంలో ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ బాల, బాలికల జట్లు ముమ్మరంగా ప్రాక్టిస్‌ చేస్తున్నాయి. కోచ్‌లు ప్రదీప్‌కుమార్‌, అహ్మద్‌ హుస్సేన్‌ల ఆధ్వర్యంలో జిల్లా జట్లకు ప్రత్యేక కోచింగ్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపే ధ్యేయంగా ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రాక్టిస్‌ చేస్తున్నారు.

● బాలుర జట్టులో రబ్బాని, కె.సంపత్‌, బి.భవ్యరాజ్‌, ఎం.చరణ్‌, గౌతమ్‌ దీక్షిత్‌, ఆర్‌.శ్రీవర్షిత్‌రెడ్డి, ఎం.జగదీష్‌, డి.అరుణ్‌ సాగర్‌, జె.రాంబాబు, ఎ.మక్బూల్‌, కె.శివకుమార్‌, కె.విక్రమ్‌, ఎన్‌.చరణ్‌, తివ్రికమ్‌, ఎంఎన్‌ దీపక్‌కుమార్‌, అద్వైత్‌ రెడ్డి, ఆర్‌.సందీప్‌, అదిత్య, నాని, కురుమూర్తి ఉన్నారు.

● బాలికల జట్టులో రాధిక, ఎస్‌.నిక్షిత, ఎ.రిత్విక, పి.దుతేశ్వరి, వి.సహస్ర, కె.భానుశ్రీ, పి.దివ్యశ్రీతేజ, బి.సంధ్య, పి.చైత్ర, బి.తనస్వి, ఎన్‌.నిర్మల, కె.శ్రీకృతి, భార్గవిప్రియ, సీహెచ్‌ వైశాలి, హేమావతి, బి.అఖిల, కె.దీక్షిత ప్రసన్న, వి.జెస్సికా, కె.అనిత, శ్రీవర్షిణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement