ఘనంగా జాతీయ మహిళా రైతు దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ మహిళా రైతు దినోత్సవం

Oct 16 2026 12:42 AM | Updated on Oct 16 2026 12:42 AM

మదనాపురం: వ్యవసాయ రంగంలో మహిళా రైతుల సేవలను ప్రశంసిస్తూ వైఎఫ్‌ఏ–కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), మహబూబ్‌నగర్‌–ఐ, మదనాపురం ఆధ్వర్యంలో జాతీయ మహిళా రైతు దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళలు రాణించడం ఆనందంగా ఉందన్నారు. విత్తనాలు వేయడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, పంటల కోత, పంట అనంతర నిర్వహణ, విత్తనాల సంరక్షణ, పశుపోషణ, ఆహార శుద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, కుటుంబ పోషణ, గ్రామీణ ఆర్థికాభివద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకమన్నారు. మహిళా రైతులకు శాసీ్త్రయ పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, నైపుణ్యాభివద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కేవీకే శాస్త్రవేత్తలు ఆర్‌. అనిత, జి. భవాని మహిళా రైతులకు వివిధ వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ పనుల్లో మహిళలపై పడే శారీరక శ్రమను తగ్గించేందుకు అనువైన వ్యవసాయ పరికరాలు, మెరుగైన పని పద్ధతుల వినియోగం గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ఇంటి ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు, ఇతర పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేయడం ద్వారా కుటుంబానికి తాజా, పోషకాహారం అందించవచ్చని పేర్కొన్నారు. పోషక తోటల వల్ల కుటుంబ పోషకాహార భద్రత మెరుగుపడటంతో పాటు కూరగాయల కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వివరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఐదుగురు మహిళా రైతులను సన్మానించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఆర్‌.అనిత, జి.భవానితో పాటు పలువురు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement