తెలకపల్లి: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ పరుశరాములు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింత వెంకటయ్య (59) ఆదివారం రాత్రి తన కొత్త ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు నర్సింహ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
భూ తగాదాలలో
వ్యక్తిహత్య
కోస్గి రూరల్: భూ తగాదాల నేపథ్యంతో తనసొంత పెద్దనాన్నను నరికి చంపిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసు కుంది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మీర్జాపూర్‌కు చెందిన పట్లె అంబదాస్(55) తన తమ్ముడి కుమారుడైన శివకుమార్‌కు కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి. తన పెద్దనాన్నను హత్య చేసిన శివకుమార్ చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన చెల్లెలుతో వికారాబాద్ జిల్లాకేంద్రంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. రెండేళ్ల క్రితం తన చెల్లెలు మౌనిక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు, చెల్లెలిను కోల్పోయిన శివకుమార్ హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. కాగా, త న తండ్రి వాటాకు వచ్చిన భూమిని సాగు చే యకుండా అంబదాస్ వేధిస్తున్నాడు. ఈ ఏడా ది కూడా తన చిన్నాన్నకు సాగుచేసేందుకు భూమి ఇచ్చినప్పటికీ సోమ వారం అంబదాస్ అడ్డుకున్నాడు. ఈ విషయౖ మె చిన్నా న్న కుమారులు వికారాబాద్‌లో ఉన్న శివకుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చా రు. దీనికితోడు తన చెల్లెలి సమాధిని అంబదాస్ నా లుగు రోజలు క్రితం ట్రాక్టర్‌తో దున్ని చెరిపే శాడు. దీన్ని మనసులో పెట్టుకున్న శివకుమా ర్ సోమవారం స్వగ్రామానికి వెళ్లి అంబదాస్ ను కత్తితో దాడి చేయడంతో తీవ్రరక్త్తశ్రావమై ఘటనా స్థలంలోనే చనిపోయాడు. శివకుమా ర్ నేరుగా పోలిస్‌స్టేషన్‌లో లొంగి పో యాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు. దీని పై విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ పురుషో త్తం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కోసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పదంగా
వ్యక్తి మృతి
జడ్చర్ల: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ మల్లేష్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం పెరంబుదూర్ జిల్లాకు చెందిన సంజీవ (50), అశోక్ కుమార్(27) పది రోజుల క్రితం మండల పరిధిలోని మల్లెబోయిన్‌పల్లి గ్రామానికి చెందిన రవీందర్‌గౌడ్ దగ్గరకు వచ్చి రాయి కొట్టే పనులలో చేరారు. ఈ క్రమంలో ఆదివారం కూలీ డబ్బులు తీసుకుని జడ్చర్లకు వచ్చి సరకులు తీసుకుని మల్లెబోయిన్‌పల్లికి చేరుకున్నారు. అక్కడ కల్లు దుకాణం వద్ద ఇద్దరు గొడవ పడగా రవీందర్‌గౌడ్ తదితరులు సర్ధి చెప్పి పంపారు. తర్వాత అర్ధరాత్రి సమయంలో సంజీవ అపస్మారక స్థితిలో పడిపోయాడని అశోక్‌కుమార్.. రవీందర్‌గౌడ్‌కు చెప్పగా వైద్య చికి త్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో సోమవారం రవీందర్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజీవ మెడ చుట్టు తాడు లేదా వైర్‌తో బిగించినట్లుగా గుర్తులు ఉన్నాయని మృతిపై అనుమానం ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడంపై విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


