● 2017 నాటి అద్దెలే నేటికీ కొనసాగింపు
● నాడు లీటర్ డీజిల్ రూ.58, ఇప్పుడు రూ.104
● ధరల పెంపును పట్టించుకోని ప్రభుత్వం..
పాలమూరు స్ట్రైకర్స్ జట్టుతో హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి, ఓనర్లు, ఎండీసీఏ ప్రతినిధులు
– వివరాలు10లో..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు దుకాణదారులు తమ వ్యాపారం సరిగా నడవడం లేదని మధ్యలోనే శాశ్వతంగా మూసేసినా అధికారులకు మాత్రం సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పాత బకాయిల పేరిట అలాగే ఉండిపోతోంది తప్పా వసూలు కాక మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కరోన కాలం (2020–21)లో నష్టాలు వచ్చాయని, ఆ తర్వాత కూడా సరిగా వ్యాపారం నడవడం లేదంటూ నగరంతో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల పరిధిలో కొన్ని దుకాణాలు శాశ్వతంగా మూసివేశారు. ఇందులో కొందరు మాత్రమే ఆయా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఈ ఫీజు వసూళ్లలో తగ్గుదల కనిపిస్తోంది. వాస్తవానికి ఈ మూడేళ్లలో వందలాది కొత్త దుకాణాలు వెలిశాయి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తేనే ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
ఫీజు వసూళ్ల తీరు ఇలా..
● మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5,285 దుకాణాలు నమోదు కాగా 2026–27కు గాను రూ.1,12,40,000 తో పాటు పాత బకాయిల కింద రూ.2,04,33,000 కలుపుకొని మొత్తం రూ.3,16,73,000 రావాల్సి ఉంది. ఇందులో 1,046 మంది నుంచిరూ.53,91,000 అలాగే పాత బకాయిల కింద రూ.8,02,000 కలుపుకొని మొత్తం రూ.61,93,000 (19.56 శాతం) మాత్రమే రాబట్టారు. ఇక 2025–26కు గాను 5,276 దుకాణాల నుంచి మొత్తం రూ.3,71,44,000 రావాల్సి ఉండగా.. రూ.1,33,06,000 (35.83 శాతం) మాత్రమే వసూలు చేశారు. అలాగే 2024–25లో 4,779 దుకాణాల నుంచి రూ.2,29,67,000 రావాల్సి ఉండగా.. కేవలం రూ.75,34,000 (32.81 శాతం) రాబట్టారు.
● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 816 దుకాణాలు నమోదు కాగా 2026–27కు గాను రూ.27,52,000తో పాటు పాత బకాయిల కింద రూ.28,50,000 కలుపుకొని మొత్తం రూ.56,02,000 రావాల్సి ఉంది. ఇందులో 279 మంది నుంచి రూ.15,55,000 అలాగే పాత బకాయిల కింద రూ.2,99,000 కలుపుకొని మొత్తం రూ.18,54,000 (33.1 శాతం) మాత్రమే వసూలుచేశారు. 2025–26లో 925 దుకాణాల నుంచి మొత్తం రూ.65,06,000 రావాల్సి ఉండగా.. రూ.32,39,000 (49.78 శాతం) మాత్రమే రాబట్టారు.
● భూత్పూర్ పరిధిలో 266 దుకాణాలు నమోదు కాగా 2026–27కు రూ.10,78,000తో పాటు పాత బకాయిల కింద రూ.12,36,000 కలుపుకొని మొత్తం రూ.23,14,000 రావాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం రూ.5,01,000 (21.61శాతం) మాత్రమే రాబట్టారు. 2025–26లో 268 దుకాణాల నుంచి రూ.18,71,000 రావాల్సి ఉండగా.. రూ.6,10,000 (32.60 శాతం) మాత్రమే వచ్చింది.
అద్దెకార్ల
‘ఓనర్ల’ గోస
– వివరాలు 10లో..
క్రికెటర్ల టాలెంట్ వెలికితీసేలా కోచింగ్
హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి
పాలమూరు స్రైక్టర్స్ జట్టు క్రీడాకారులకు
ఘన స్వాగతం
– మహబూబ్‌నగర్ క్రీడలు
ఏటేటా అంతంత మాత్రమే ఫీజు వసూలు
నగరంలో దుకాణదారుల అవగాహన లోపం
శాశ్వతంగా మూసేసినా
సమాచారం ఇవ్వని తీరు
క్షేత్రస్థాయిలో సరిగా తనిఖీలు
చేయని మున్సిపల్ అధికారులు


