అలంపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘాన్ని అన్ని విధాల బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంపూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బడిచౌడి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘం ప్రథమ సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలపించారు. అలాగే తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘం పటిష్టంగా ఉంటే ప్రభుత్వం మన డిమాండ్లను త్వరగా ఆమోదిస్తుందన్నారు. హెల్త్ కార్డులు, దసరా కానుకగా పీఆర్సీ మంజురు, పెండింగ్ 5 డీఏలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం విజయవంతం చేసేందుకు కృషి చేసిన వెంకట్రామయ్య, స్థానిక ఉద్యోగులను రాష్ట్ర కార్యవర్గ సంఘం నాయకులు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సీతారామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ప్రహ్లాదరావు, గద్వాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు వెంకట్రామయ్య శెట్టి, కృష్ణమూర్తి, మద్దిలేటి, గోపాల కృష్ణయ్య, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


