నగరంలో మత్తు పదార్థాల నిల్వలపై తనిఖీలు
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలపై సోమవారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వ హించారు. నార్కోటిక్ డాగ్‌స్క్వాడ్‌తో కీలక ప్రాంతాల్లో విస్తృతంగా సోదా లు నిర్వహించారు. ముఖ్య కూడళ్లు క్లాక్‌టవర్, పాన్‌చౌరస్తా, రాంమందిర్ చౌర స్తా లో ఉన్న దుకాణాలు, పాన్ దుకాణాల్లో తనిఖీలు చేసి మత్తు పదార్థాల నిల్వ లు, అ క్రమ విక్రయాలపై ఆరా తీశారు. న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్థాల వి క్రయాలు, నిల్వలు, వినియోగానికి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో మత్తు పదార్థాల నిల్వలపై తనిఖీలు


