వాగులు లూటీ
నిఘా ఏర్పాటు చేస్తాం..
● జోరుగా ఇసుక అక్రమ దందా
● చిట్యాల వాగులో ఏకంగా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు
మక్తల్: ఇసుకాసురాలు వాగులను లూఠీ చేస్తున్నా రు. మక్తల్ మండలంలోని చిట్యాల, దాసర్‌దొడ్డి వాగులతో పాటు మాగనూర్ మండలంలోని వాగు ల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మక్తల్, నేరడ్గం గ్రామా ల వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మాగనూర్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇసుక రవా ణా ఆ గడం లేదు. తమను ఎవరు అడ్డుకుంటారనే విధంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. అను మతుల మాటున అక్రమ దందా సాగిస్తున్నారు. చి ట్యాల వాగులో ఏకంగా తాత్కాలిక రోడ్డు నిర్మించు కున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలింపుపై అధికారులకు సమాచా రం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీస్, మై నింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకెళ్లే ఇసుక పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేస్తాం. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొందరు టీఎస్‌ఎండీసీ అనుమతుల పేరుతో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
– సతీశ్‌కుమార్,
తహసీల్దార్, మక్తల్


