మహబూబ్‌నగర్ శుభారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ రెండో ఫేజ్‌లో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 43 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అబ్దుల్ రాఫే (మహబూబ్‌నగర్) నిలిచాడు. పాలమూరు జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి ఉదేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, కోచ్ అబ్దుల్లా, శివశంకర్, రమణ అభినందించారు.


