సివిల్ వివాదాలకు వెళ్లొద్దు
● చట్టపరిధిలో సమస్యలకు పరిష్కారం చూపాలి : ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ క్రైం: సమస్యలను తక్షణం పరిష్కారం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 15 మంది బాధితులు తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. వారి దరఖాస్తులను పరిశీలించిన ఆమె ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కలిగిస్తూ అనవసరంగా సివిల్ వివాదాలలోకి వెళ్లకుండా చట్ట పరిధిలోనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్లలో సమస్యకు పరిష్కారం లభించకపోతే ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నేరుగా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


