ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ నవీన్ అన్నారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్‌డీఓ నర్సిములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆహార భద్రత కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఆహారభద్రత– జాతీయతపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రత ఎంతో కీలకమైందని, ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంపిణీ వ్యవస్థ మనదేశంలో ఉందన్నారు. విద్యార్థులు జాతీయత భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కుమారస్వామి, వెంకట్, విజయ్‌భాస్కర్, పుష్పలత, మాధురి తదితరులు పాల్గొన్నారు.
నేడు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రకాల ప్రైవేట్ కంపెనీలో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 89193 80410, 99485 68830 నంబర్లను సంప్రదించాలని కోరారు.
స్టేట్‌హోం బాలలకు పుస్తకాల పంపిణీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక స్టేట్‌హోంలో ఉంటున్న 15 మంది విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్‌లో ఓపెన్ స్కూల్ పాఠ్య పుస్తకాలను జిల్లా అధికారులు పంపిణీ చేశారు. కాగా, ఈ విద్యార్థులు ఇటీవల ఓపెన్ స్కూల్ ఇంటర్‌లో చేరగా కలెక్టర్ విజయేందిర బోయి ఫీజులు చెల్లించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి జరీనాబేగం మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చదువులు కొనసాగించాలన్నారు. జీవితంలో బాగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్మద, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివయ్య, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ.2,779
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో సోమవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ. 2,779, కనిష్టంగా రూ.2,000 ధరలు లభించా యి. హంస గరిష్టంగా రూ.1,960, కనిష్టంగా రూ.1,926, కందులు గరిష్టంగా రూ.6,660, వేరుశనగ గరిష్టంగా రూ.8,549, మినుములు రూ. 7,401, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,001 ధరలు పలికాయి.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి


