
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–11 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంంటారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ గోపాల్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ పాల్గొన్నారు. కాగా..బాలుర సింగిల్స్‌లో అర్విన్ భాస్కర్ (ప్రథమ), విహాన్ (ద్వితీయ), బాలికల్లో డి.శ్రీహాస (ప్రథమ), లాస్యశ్రీ (ద్వితీయ), బాలుర డబుల్స్‌లో ఎస్.విహాన్–విశ్వతేజ, బాలికల డబుల్స్‌లో ఆద్య–అనుశ్రీలను ఎంపిక చేశారు.