చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి

Aug 1 2025 12:21 PM | Updated on Aug 2 2025 10:20 AM

చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి

చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): టీడీ గుట్టలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చిరుతను పట్టుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. గురువారం సాయంత్రం చిన్నదర్పల్లికి వెళుతున్న ఆయనకు గుట్టపై చిరుత తారసపడడంతో కారు దిగి గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులవుతున్నా.. అధికారులు చిరుతను పట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. అటవీశాఖ అధికారులు అవసరం అయితే నిపుణుల ను పలిపించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది తక్కువగా ఉంటే ఇత ర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement