
మోడల్ స్కూల్‌కు కదిలిన యంత్రాంగం
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో హాస్టల్ విద్యార్థినులు పడుతున్న అవస్థలపై బుధవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘మోడల్ స్కూల్.. కంపు కంపు’ కథనానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణి కారెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డితో పాటు విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై మోడల్ స్కూల్‌కు చేరుకున్నారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశిలించారు. కలెక్టర్ ఫండ్ రూ. 2.5లక్షలతో హాస్టల్ భవనానికి మరమ్మతు చేయించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు, ఏఎంఓ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతానికి నీటి లీకేజీలకు మరమ్మతు చేయి స్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారం రోజుల్లో విద్యార్థినుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కాగా, హాస్టల్‌లో మరుగుదొడ్లు, మూ త్రశాలలను బాగు చేయడంతో పాటు నీటి లీకేజీలకు మరమ్మతు చేయించే వరకు తాము హాస్టల్‌లోకి వెళ్లమని విద్యార్థినులు భీష్మించారు. అయితే మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేస్తామని డీఈఓ నచ్చజెప్పడంతో విద్యార్థినులు శాంతించారు. అధికారుల వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, జీసీడీఓ నర్మద, ప్రిన్సిపాల్ గంగమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రహిమన్‌ఖాన్, రఘవేందర్‌రెడ్డి, నరేందర్ ఉన్నారు.
మూత్రశాలలు,
మరుగుదొడ్లకు మరమ్మతు
వారం రోజుల్లో సమస్యలన్నీ
పరిష్కరిస్తామని హామీ

మోడల్ స్కూల్‌కు కదిలిన యంత్రాంగం

మోడల్ స్కూల్‌కు కదిలిన యంత్రాంగం