
జడ్చర్లలో మూడు డెంగీ కేసులు నమోదు
జడ్చర్ల టౌన్: పుర పరిధిలోని సంజీవయ్య కాలని, కృష్ణారెడ్డినగర్, జవహర్‌నగర్‌కాలనీలో ముగ్గురికి డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయిందని అర్బన్‌హెల్త్ సెంటర్ వైద్యాధికారి డా. మనుప్రియ తెలిపారు. బాధితుల్లో ఇద్దరు స్థానిక ఏరియా ఆస్పత్రిలో, మరొకరు ఇంటివద్దే చికి త్స పొందుతున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో బుధవారం ఫీవర్ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించారు. రసాయనాలను పిచికారీ చేయగా జిల్లా ప్రోగ్రాం అధికారి డా. భాస్కర్‌నాయక్ పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమ లు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ సలోమి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేష్, వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉధృతంగా దుందుభీ.. అదుపుతప్పిన ట్రాక్టర్
తాడూరు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో సిర్సవాడ నుంచి మాదారానికి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రా మాల రైతులు ట్రాక్టర్‌లో నదిదాటుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. గమనించిన స్థానికులు జేసీబీ వాహనం ద్వారా ట్రాక్టర్ ను బయటకు తీశారు. స్థానికులు మాట్లాడుతూ.. ప్రతిఏటా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలపడం ప్రకటనలకే పరిమితమైందని వాపోయారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా లని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

జడ్చర్లలో మూడు డెంగీ కేసులు నమోదు