
లూడో గేమ్‌కు యువకుడి బలి.. మనోవేదనతో తాత మృతి
నర్వ: ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అతడి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తాత తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రాయికోడ్‌కు చెందిన తెలుగు పోతుల వెంకటేశ్ (18) బతుకుదెరువు నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో గార్డెనింగ్ పనిచేసే వాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడిన ఆతడు.. చేసిన కష్టంతో పాటు అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చే దారిలేక.. ఇంట్లో చెబుకోలేక ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లోనే క్రిమిసింహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అక్కడే కేసు నమోదైంది. నాలుగు రోజుల క్రితం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఖననం చేశారు. ఇదిలా ఉంటే, బుధవారం కుటుంబసభ్యులు తమ కులాచారం ప్రకారం మక్తల్‌లో సంత చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో మృతుడి తాత పోతుల బాలప్ప (80) సైతం వెళ్లి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మనువడి మృతిపై తీవ్ర మనోవేదనకు గురైన అతడు.. ఏడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే తాత, మనువడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లూడో గేమ్‌కు యువకుడి బలి.. మనోవేదనతో తాత మృతి