
కలుపు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వీపనగండ్ల: పోలీసులు మందలించారని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చాపల రాముడు బొలెరో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నెలకిందట మండల కేంద్రానికి సమీపంలో బైక్‌ను ఢీక్కొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. బాధిత కుటుంబానికి కొంత నగదును పరిహారంగా ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఇంటితోపాటు తల్లిదండ్రుల పేరున ఉన్న పొలం తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చేందుకు య త్నించగా.. తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో శుక్రవారం రాత్రి తల్లిపై చెయ్యి చేసుకోగా విషయం తెలుసుకున్న అతని అక్కాచెల్లులు రాముడిపై శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాముడిని ఠాణాకు పిలిపించి ‘‘ఇప్పటికే నీపై కేసు నమోదైంది.. మళ్లీ కుటుంబ సభ్యులపై దాడి చేశావు.. మరోసారి కేసు నమోదు చేసి. జైలుకు పంపించాల్సి వస్తుందని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై స్టేషన్ ఆవరణలోనే కలుపునివారణ మందు తాగి అతని కుమారుడు శ్రీహరికి సైతం తాగించాడు. వెంటనే తేరుకున్న పోలీసులు తండ్రి, కుమారుడిని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో కొత్తకోట సీఐ రాంబాబు, పెబ్బేరు ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి, శ్రీరంగాపురం ఎస్‌ఐ రామకృష్ణ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి బాధితుడి భార్య చెన్నమ్మతో మాట్లాడి కానిస్టేబుల్‌తో వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాముడి వద్దకు పంపించారు. ఘటనపై సీఐ రాంబాబును వివరణ కోరగా.. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు రాముడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ రాణి మందలించారు.అంతమాత్రానికే కలుపు నివారణ మందు తాగాడని వివరణ ఇచ్చారు.
వీపనగండ్ల
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతున్న రాముడు
పోలీసులు మందలించారని ఠాణా ఎదుటే ఘటన
వెంటనే తేరుకుని ఆస్పత్రికి తరలించిన పోలీసులు