
కారు బోల్తా.. ఒకరు మృతి
కొత్తకోట రూరల్: అతివేగంగా వెళ్తున్న కారు ముందు టైర్ పేలి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాలు.. శనివారం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జాతీయ రహదారి 44పై ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జూపాడ్‌బంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఓంకార్ నాగిరెడ్డి(37) భార్య వర్షిణికి వైద్య చికిత్స నిమిత్తం అన్న ప్రభాకర్‌రెడ్డి, ప్రమీలమ్మతో కలిసి స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలోకి రాగానే కారు కుడివైపు ముందు టైర్ పేలడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ డివైడర్ దాటి కర్నూలు వైపు వెళ్లే రోడ్డుపై పడింది. దీంతో కారు నడుపుతున్న ఓంకార్ నాగిరెడ్డికి తల, ఇతర భాగాలకు, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఓంకార్ నాగిరెడ్డి మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి మామ ఉట్కూర్ రంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ముగ్గురికి తీవ్రగాయాలు

కారు బోల్తా.. ఒకరు మృతి