
గుడిపల్లి లిఫ్ట్ నుంచి నీటి విడుదల
నాగర్‌కర్నూల్ రూరల్: మండలంలోని గుడిపల్లి వద్ద ఉన్న మహాత్మాగాంధీ మూడో లిఫ్ట్ వద్ద శుక్రవారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేసి మోటారు ప్రారంభించి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్నివిధాలుగా న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈలు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.