
శాకంబరీదేవిగా జోగుళాంబ అమ్మవారు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారు శుక్రవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాసం చివరి శుక్రవారం కావడంతో అర్చకులు అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయాలతో అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓ పురేందర్‌కుమార్, ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
● జోగుళాంబ అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఈఓ పురేందర్‌కుమార్, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.