కరాటే, యోగా గురువు వెంకటేశ్‌... | - | Sakshi
Sakshi News home page

కరాటే, యోగా గురువు వెంకటేశ్‌...

Jun 21 2025 3:55 AM | Updated on Jun 21 2025 3:55 AM

కరాటే, యోగా గురువు  వెంకటేశ్‌...

కరాటే, యోగా గురువు వెంకటేశ్‌...

జిల్లా కేంద్రానికి చెందిన కోటకదిర వెంకటేశ్‌ కరాటేతో పాటు యోగా మాస్టర్‌గా పేరొందారు. విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా యోగాలో శిక్షణ అందజేస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లా కేంద్రంలో కరాటే, యోగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్‌ కరాటేలో 1997లో బ్లాక్‌ బెల్టు అందుకున్నారు. బాలకిష్టయ్యగౌడ్‌ వద్ద యోగా నేర్చుకున్నారు. 24 ఏళ్ల నుంచి నిత్యం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ మాడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరాటే, యోగాలో శిక్షణ అందిస్తున్నారు. 2023లో జిల్లా కేంద్రం మీదుగా సాగిన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఎదుట యోగా విన్యాసాలు ప్రదర్శించి, మన్ననలు పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపూర్‌లో జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement