
సోయాబీన్‌లో యాజమాన్య పద్ధతులు
అలంపూర్: నైరుతి రుతుపవనాల రాకతో వానలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సిద్ధం అవుతున్నారు. నల్లరేగడి నేలల్లో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పంటను సాగు చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. కందిలో సహయ పంటగా, పండ్ల తోటలో అంతర్ పంటగానూ సోయాబీన్ విత్తుకోవచ్చన్నారు.
నేలలు.. మురుగు నీరు పోయే వసతి ఉండి, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి.
రకాలు.. జేఎస్–335, ఎల్‌ఎస్‌బీ–1, పీకే–472 ఇందులో జేఎస్ 335 రకం ప్రసిద్ధి చెందింది.
పంట కాలం.. సోయాబీన్ పంట కాలం 100
నుంచి 110 రోజులు
పంట వేసే పద్ధతి.. సోయాను పత్తి, కందిలో అంతర్, మిశ్రమ పంటగా వేయవచ్చును. వానాకాలంలో సోయా సాగు తర్వాత రబీలో శనగ, మినుములు వేసుకోవచ్చు.
విత్తనం.. విత్తనం ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరం. విత్తనాన్ని 45 ఇంటూ 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకు వరసలోని మొక్కల మధ్య 3 సెంటీమీటర్ల లోతులో మొత్తటి దుక్కిలో నాటు వేసుకోవాలి.
విత్తే కాలం : జూన్ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు సోయాబీన్ విత్తడానికి అనుకూలం.
కలుపు నివారణ.. సోయాలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి 250 మి.లీ ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కలుపును నివారించొచ్చు.
ఎరువులు.. ఎకరానికి 25 కిలోల యూరియా, 150 కేజీల సూపర్, 25 కిలోల పొటాష్ అవసరం. విత్తేటప్పుడు ఫోరేట్ 10 జీ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడితే కాండపు ఈగలాంటి పురుగును నివారించుకోవచ్చు.
పాడి–పంట
పంట కోత ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి, రాలిపోవడం మొదలైనప్పుడు లేదా కాయలు ఆకుపచ్చ నుంచి బూడిద రంగులోకి మారినప్పుడు కోయాలి. కోత ఆలస్యం అయితే కాయలు చిట్లి గింజలు రాలిపోతాయి. పంట కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆరనిచ్చి గింజలోని తేమ శాతం 14 వరకు చూసి నూర్పిడి చేయాలి.
దిగుబడి సోయా సాగుకు ఎకరానికి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

సోయాబీన్‌లో యాజమాన్య పద్ధతులు

సోయాబీన్‌లో యాజమాన్య పద్ధతులు