మూడు పెద్ద ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఎంపీ, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నా హయాంలోనే జరిగాయి. 2023 ఫిబ్రవరి 1న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టానని భావిస్తున్నా. ప్రధానంగా ధరణి సమస్యలతో పాటు ప్రజావాణిలో వచ్చే ప్రజా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు చేరుకావడం సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలు నాపై చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోను. – రవినాయక్, కలెక్టర్, మహబూబ్‌నగర్