మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. శుక్రవారం 1,010 అడుగులకు చేరిందని ఏఈ సింగిరెడ్డి రనీల్‌రెడ్డి తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. తాగునీటి అవసరాలకు 20 క్కూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు.
నాగర్‌కర్నూల్‌లో
పద్మావతి కళాశాలకు
రూ.లక్ష జరిమానా
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు, రెండేళ్లు కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహించకుండా అనుమతులు రద్దు చేశారు. యాజమాన్యం అడ్డగోలు ఫీజులు వసూలు చేయడం, ప్రాక్టికల్స్ సమయంలో డబ్బులు వసూలు చేయడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వంటి రాతపూర్వక ఫిర్యాదులు రావడంతో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ ఇంటర్ బోర్డుకు నివేదిక అందజేఽశారు. దీంతో బోర్డు కళాశాలకు జరిమానా విధించడంతో పాటు, ప్రాక్టికల్స్ నిర్వహణను రెండేళ్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.
మహిళకు రోబోటిక్ సర్జరీ
పాలమూరు: రోబోటిక్ సర్జరీ ద్వారా ఓ మహిళ గర్భాశయంలోని పెద్ద గడ్డను ఎలాంటి నొప్పి లేకుండా తొలగించి, ఒకే రోజులో ఇంటికి పంపించామని మలక్‌పేట్ యశోద ఆస్పత్రి సీనియర్ ల్యాప్రొస్కోపిక్ సర్జర్ డాక్టర్ టి.సురేందర్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి చెందిన 42 ఏళ్ల మహిళ తీవ్ర నొప్పితో ఆస్పత్రికి వచ్చిందని చెప్పారు. అవసరమైన పరీక్షలు చేసి, గర్భాశయంలో పెద్దగడ్డ కారణంగా తీవ్ర రక్తస్రావం జరుగుతుందని గుర్తించినట్లు చెప్పారు. దీంతో పాటు గాలిబ్లడర్‌లో కూడా అధికంగా రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు క్వాడ్రెంట్ రోబోటిక్ సర్జరీ చేశామని చెప్పారు. భరించలేని నొప్పిని దూరం చేయాల్సిన సందర్భాల్లో రోబోటిక్ సర్జరీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అడ్వాన్స్ డామిన్స్ రోబోటిక్ సర్జరీ కోసం యూఎస్‌ఏలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ల్యాప్రోస్కోపిలో చేసే ప్రతి సర్జరీ కూడా రోబోటిక్ విధానం ద్వారా చేయవచ్చని వివరించారు. సమావేశంలో మార్కెటింగ్ హెచ్‌ఓడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.