Mahabubnagar: సమస్యాత్మక కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరింవచాలి

- - Sakshi

సెక్టోరల్‌ అధికారులదే కీలకపాత్ర

కలెక్టర్‌ రవినాయక్‌

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్‌ ఆదేశించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, వెబ్‌ కాస్టింగ్‌ తదితర అంశాలపై మంగళవారం ఆయన ఐడీఓసీ నుంచి సెక్టోరల్‌ అధికారులు, ఏఆర్వోలు, బీఎల్వోలు తదితరులతో వెబెక్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌ నిర్వహించే ఐదు రోజుల ముందే అంటే 25వ తేదీలోగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. సెక్టోరల్‌ అధికారులు ప్రతిరోజు ఏ ప్రాంతంలో ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేస్తున్నది ముందుగానే షెడ్యూల్‌లో పేర్కొనాలని, సదరు షెడ్యూల్‌ను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని, బీఎల్‌ఓలతో పాటు, బీఎల్‌ఏలకు ఈ విషయం చెప్పాలన్నారు.

ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై తక్షణమే బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించాలని, అదేవిధంగా సెక్టోరల్‌ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఏ రోజుకు ఆ రోజు ఎన్ని స్లిప్పులు పంపిణీ చేసింది నివేదిక సమర్పించాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను, ఓటరు గైడ్‌, సీ–విజిల్‌ పోస్టర్లను తక్షణమే సేకరించుకోవాలని ఆదేశించారు. ఒకసారి ఓటరు ఇంటికి వెళ్లినప్పుడు ఓటరు లేనట్లయితే మరోసారి వెళ్లాలని సూచించారు.

ఓటరు సమాచార స్లిప్పులు కేవలం బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులు పంపిణీ చేయకూడదని, ఇంట్లో ఓటరు లేనట్లయితే పెద్ద వారికి మాత్రమే ఇచ్చి సంతకం తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులు బీఎల్‌ఓ దగ్గర కాకుండా ఇతరుల వద్ద కనబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు సెక్టోరల్‌ అధికారులు సరాసరిన తనిఖీ చేయాలన్నారు.

రిటర్నింగ్‌ అధికారులు ఓటరు సమాచార స్లిప్పులపై హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని, ఫోన్‌ నంబర్‌ ఏర్పాటు చేసి ఓటరు సమాచార స్లిప్పులపై వచ్చే ఫిర్యాదు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

వెబ్‌కాస్టింగ్‌పై కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమైన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని, ఇందుకు తక్షణమే ఏఆర్వోలు పోలింగ్‌కేంద్రాల లేఔట్లను రూపొందించి పంపించాలని ఆదేశించారు.

కేంద్రాలలో కరెంటు సరఫరా, త్రీ పిన్‌ ఫ్లగ్‌ వంటివి ఉన్నాయో లేదో చూడాలని, ఏజెన్సీ వెబ్‌ కాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేసే సమయంలో పూర్తిగా సహకరించి లే ఔట్‌ ప్రకారం కెమెరా ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియజేయాలని ఆదేశించారు.

ఆబ్సెంట్‌ ఓటర్లను సమీక్షిస్తూ ఫామ్‌–12–డీ ప్రకారం ఏ పోలింగ్‌ కేంద్రంలో ఎంతమంది హోం ఓటర్లు ఉన్నారో చూసుకుని అందుకు తగ్గట్టుగా రూట్‌ మ్యాప్‌ తయారు చేయాలని, ఎంత మంది పోలింగ్‌ సిబ్బంది అవసరం ఉంటుందో ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2023
Nov 15, 2023, 07:41 IST
హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన ఒక వ్యూహకర్త ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు అవకాశాలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం...
15-11-2023
Nov 15, 2023, 07:19 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దాదాపు రెండు వారాలు మాత్రమే గడువుంది. ఈలోగా విస్తృత ప్రచారానికి అధికార బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది....
15-11-2023
Nov 15, 2023, 07:15 IST
హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని ఈఆర్‌ఓల నుంచి బూత్‌ లెవల్‌ అధికారుల వరకు ఓటరు జాబితాలను పరిశీలన చేశారా? లేదా? అనే సందేహాలు...
15-11-2023
Nov 15, 2023, 05:50 IST
చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ...
15-11-2023
Nov 15, 2023, 05:41 IST
సాక్షి, వరంగల్‌/జనగామ/ సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి...
15-11-2023
Nov 15, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు....
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెబెల్స్‌ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు...
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
వికారాబాద్‌: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో...
15-11-2023
Nov 15, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ...
15-11-2023
Nov 15, 2023, 04:02 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, మహబూబాబాద్‌/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుండా.....
15-11-2023
Nov 15, 2023, 00:42 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆర్మూర్‌ నియోజకవర్గంలో గోర్త రా...
14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం.. 
14-11-2023
Nov 14, 2023, 15:16 IST
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని..
14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...



 

Read also in:
Back to Top