● డీఏఓ విజయచంద్ర
మహబూబాబాద్ రూరల్ : జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని డీఏఓ విజయచంద్ర అన్నారు. సహజ వ్యవసాయంపై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏఓ మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో ఒక క్లస్టర్ పరిధిలో 125 మంది రైతులతో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారని తెలిపారు. జిల్లాలోని సీఆర్పీ, బీఆర్సీలు సమన్వయకర్తలుగా ఉంటారని, రైతులతో వారు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నేల పరిరక్షణ కోసం తయారు చేయించి, వారి పొలాల్లో వాడే విధ ంగా ప్రోత్సహించాలని సూచించారు. రిసోర్స్ ప ర్సన్, మల్యాల హెచ్‌ఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రశా ంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ రైతు జైపాల్ రెడ్డి, మరిపెడ ఏడీఏ మురళి, ఏపీఎం బాబు ఉన్నారు.


