బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హన్మకొండ: రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటు అందిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ –8 ఎడిషన్ పోటీల విజేతలకు హైదరాబాద్ నందిహిల్స్‌లో నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రౖపైజ్‌మనీ చెక్కు, ట్రోఫీలను కేటీఆర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గొప్ప క్రీడా పాలసీని తీసుకు రావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. వచ్చే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, కాకతీయ క్రికెట్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ ఫారూక్ అలీ, ప్రెసిడెంట్ ఫిరోజ్, సభ్యులు మాజీద్, వీరు, సిరాజ్, రాజేశ్, రాంబాబు, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్ రావు, బొంగు అశోక్ యాదవ్, నాయకులు పులి రజనీ కాంత్, మూటిక రాజు, యాదగిరి, జోరిక రమేశ్, నయీమొద్దీన్, ఇమ్మడి రాజు, దువ్వ కనకరాజు, ఇస్మాయిల్, కేశోజు ప్రణయ్, చిన్నా, రామ్మూర్తి, రాకేశ్ యాదవ్, వినీల్ రావు పాల్గొన్నారు.


