పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం పాలన
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జిల్లాలు అశాసీ్త్రయంగా ఉన్నాయని, మార్పులు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలన సౌలభ్యం కోసం మాజీ సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారన్నా రు. జిల్లాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు ప్రకటిస్తే, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నా రు. ఆ నిధులనే మళ్లీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, మా నుకోట మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు ఫరీద్, రవి, రంజిత్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శబ రీష్ అన్నారు. ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, హషీష్(నూనె)ను మంగళవారం దహ నం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి న్యాయస్థానం అనుమతితో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 242 కిలోల గంజాయి, 226 గ్రాముల హషీష్‌ను దహనం చేసినట్లు చెప్పారు. మహబూబాబాద్ టౌన్, డోర్నకల్, కేసముద్రం, కురవి, గూడూరు, గార్ల, మరిపెడ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్ పరిధిలోని ప్రత్యేక యంత్రాల ద్వారా పూర్తిగా దహనం చేసి నాశనం చేశారన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట
కేసముద్రం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో ప్రజాబాట చేపట్టినట్లు విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ విజయేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్‌లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కేసముద్రంవిలేజ్, ఉప్పరపల్లిలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ పనులు, మున్సిపాలిటీలో జరుగుతున్న విద్యుత్ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఈ ఐలయ్య, ఏఈ రాజు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా నూతన కమిటీ
మహబూబాబాద్ అర్బన్: పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ మంగళవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బోడ రాంజీనాయక్, ప్రధాన కార్యదర్శిగా జన్ను రాజమౌళిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పులి దేవేందర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు, బకాయిలను విడుదల చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దిశగా నాయకులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్, వంగల్ జిల్లా అధ్యక్షుడు హర్షం సురేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కురమ పున్నంచందర్, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం పాలన
పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం పాలన


