మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి మించి స్థానాలు గెలిచాం.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం మనదే.. ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోటీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీవాస్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళ వారం మానుకోట మున్సిపాలిటీలో రూ.70కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి శుంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో గత పాలకులు వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని, ఆర్భాటాల కోసం శంకుస్థాపనలు చేసి పనులు గాలికి వదిలేశారని ఆరోపించారు. అభివృద్ధి చేయని బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మానుకోట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని కోరా రు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. మానుకోటతో పాటు డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల ప్రత్యేక చొరవతో మానుకోట అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొచ్చి.. ఆదర్శంగా మారుస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఉమా పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శంకుస్థాపనలు..
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలోని 17వ వార్డు పరిధి జ్యోతిబాపూలే కాలనీలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయినేజీ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆరో వార్డు పరిధి బేతోలు గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, 19 వార్డు పరిధి బందం చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణం, అదే వార్డులో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. 11, 23, 33 వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మూడుకొట్ల సెంటర్‌లో శంకుస్థాపన చేశారు. నందన గార్డెన్, హస్తినాపు రం కాలనీల సమీపంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్, ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు అంజయ్య, ప్రవీ ణ్, రమేశ్, వెంకటేశ్వర్లు, ఓం నారాయణ లోయ, శ్రీనివాస్, చలమల నారాయణ, ఖలీల్, నర్సింహారావు, గిరిధర్ గుప్త, శ్యాం, దిలీప్ ఉన్నారు.


