
దేశానికే ఆదర్శం.. ముల్కనూరు సీ్త్రశక్తి
ఎల్కతుర్తి : కరువు కాలంలో ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ తోడ్పాటుతో జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ ముల్కనూరులో డెయిరీని ఏర్పాటు చేశారు. మహిళల స్వయం కృషితో ఎదగాలనే ఆకాంక్షతో ముల్కనూర్‌లో కోఆపరేటివ్ గ్రామీణ బ్యాంకు సహకారంతో 2002లో స్వయంకృషి మహిళా సహకార డెయిరీని స్థాపించారు. నాణ్యమైన పాలను సరఫరా చేస్తూ అనతి కాలంలోనే నాలుగు జిల్లాల్లో వ్యాపారాన్ని విస్తరించి, నేడు 203 సంఘాలతో 23,045 మంది మహిళా సభ్యులు, 80వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.200కోట్ల వ్యాపారం చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇందుకు గాను రెండు సార్లు జాతీయ స్థాయిలో డెయిరీ అవార్డులు అందుకున్నారు. ఎన్‌డీబీ సహకారంతో రూ.12కోట్లతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు.
మహిళల ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం ముల్కనూరు డెయిరీ
2,300 మంది సభ్యులు,
80వేల లీటర్ల పాల సేకరణ
రూ.200కోట్ల వ్యాపారం
రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డులు

దేశానికే ఆదర్శం.. ముల్కనూరు సీ్త్రశక్తి

దేశానికే ఆదర్శం.. ముల్కనూరు సీ్త్రశక్తి