
అండర్–19 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల చివరి వారం నుంచి జరగనున్న అండర్–19 లీగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తుది జాబితాను వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన అంతర్‌జిల్లాల స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి జట్టులో స్థానం కల్పించినట్లు తెలిపారు. అసోసియషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, శంకర్, పవన్ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. జిల్లా జట్టుకు బి. సాత్విక్, వి. ప్రీతేశ్, పి. రంగారావు, ఓ. సుకుమార్, బి. దయానంద్, జె. విశ్వక్‌సాయి, పి. శ్రీకాంత్, ఎం. మనీశ్ కుమార్, డి. మన్‌దీప్‌సింగ్, ఎం. పుజిత్, వి. అశ్విత్, బి. చరణ్, సి. జశ్వంత్, బి. మనోజ్, కె. రిత్విక్, బి. వితేశ్, ఎం. రాంచరణ్, ఎం. రాణాచరణ్, స్టాండ్ బైలుగా ప్రవీణ్, పార్థిషన్, లక్ష్మణ్ ఎంపికై నట్లు తెలిపారు.