
యోగాతో ఆరోగ్యం..
యోగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకు తె లియకుండా తీసుకునే ఆ హారంలో విషపదార్థాలు ఉంటున్నాయి. దీంతో మధుమేహం, అధిక బ రువు, గుండె జబ్బు వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఫలితంగా 40 ఏళ్లకే వివిధ వ్యాధులతో మంచం పట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజూ 30 నిమిషాలు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.
–తమ్మి స్రవంతి, గృహిణి, పాలకుర్తి
ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతో
ప్రజలకు ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతోనే శ్రీ పరివార్ ఆధ్వర్యంలో ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. యోగాసనాల ద్వారా ఆరోగ్యంగా ఉంచాలన్నదే మా ముఖ్య ఉద్దేశం.
–పెండ్లి రాజు బాపూజీ,
యోగా గురువు,పాలకుర్తి
●

యోగాతో ఆరోగ్యం..