ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగరంలోని ఒక హోటల్‌లో గురువారం ఆన్‌లైన్‌ విధానంలో వివాహ నిశ్చితార్థం నిర్వహించారు. ఇందు కోసం పెద్ద ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేశారు. అమెరికాలో ఎంఎస్‌ చదివి అక్కడి విస్కాన్సిన్‌ స్టేట్‌లోని మేడ్‌సన్‌ సిటీలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న మేఘన, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్న తిరుపతికి చెందిన ప్రేమ్‌కుమార్‌ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో కర్నూలుకు రాలేక పెద్దల అంగీకారంతో నిశ్చితార్థాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. ఇందుకు స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఎదురెదురుగా కూర్చు ని పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిశ్చితార్థ వేడుక సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement