రేపు జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు జాతీయ లోక్‌ అదాలత్‌

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

కర్నూలు: ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై 11 రెండో శనివారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయ స్థానాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ కాదగిన సివిల్‌, క్రిమినల్‌, ప్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించడానికి లోక్‌ అదాలత్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణంలో 8 బెంచీలు, మిగతా మండలాల్లో 23 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకుని తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement