ఎమ్మిగనూరుసెంట్రల్: పార్లపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరికి డీవైఎఫ్‌ఐ నాయకులు మద్దతు పలికారు. ఈసందర్భంగా డీవైఎఫ్‌ఐ పట్టణ కన్వీనర్ విజయ్, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ 1నుంచి 5వ తరగతి వరకు 74 మంది విద్యార్థులు ఉన్నారని, వీరిందరికీ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని, దీంతో విద్య కుంటు పడుతుందన్నారు. విద్యాశాఖామంత్రి చర్యలు తీసుకొని విద్యార్థులకు అనుగునంగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.


