బండి ఆత్మకూరు: పొలం పనుల వద్ద తండ్రికి చేదోడుగా వెళ్లిన కుమారుడు విద్యాదాఘాతంతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన పార్నపల్లెలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హుసేన్ బాషా(16) నంద్యాల పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం తండ్రికి సాయం చేసేందుకు పొలానికి వెళ్లాడు. పొలం వద్ద పంటకు నీళ్లు కట్టే క్రమంలో భాగంగా విద్యుత్ మోటార్ వద్ద స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన షర్ఫుద్దీన్, రహీమూన్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సంతానం. కాగా అందరికంటే చిన్నవాడైన హుస్సేన్ బాషా మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.


